మరోసారి నాగచైతన్య హిందీ సినిమా డిలే

మరోసారి నాగచైతన్య హిందీ సినిమా డిలే
మరోసారి నాగచైతన్య హిందీ సినిమా డిలే

అక్కినేని నాగ చైతన్య హిందీ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య స్పెషల్ రోల్ చేస్తున్నాడు. క్లైమాక్స్ వద్ద దాదాపు 20 నిముషాలు నిడివున్న పాత్రను ఒప్పుకున్నాడు నాగ చైతన్య. ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరో చిత్రంలో నటిస్తే బాలీవుడ్ లో ఎక్స్పోజర్ వస్తుందని నమ్ముతున్నాడు.

చైతన్య పోర్షన్స్ ఎక్కువగా కార్గిల్, లడఖ్ వద్ద షూటింగ్ చేయాల్సి ఉంది. జూన్ లేదా జులైలో షూటింగ్ మొదలవుతుందని అనుకున్నారు కానీ ప్రస్తుతం అది జరిగేలా కనిపించడం లేదు. లాల్ సింగ్ చద్దా షూటింగ్ మరోసారి హోల్డ్ లో పడింది. గత రెండేళ్ల నుండి ఈ చిత్ర షూటింగ్ సాగుతూనే ఉంది.

ఇక తెలుగులో లవ్ స్టోరీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్ర షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసేసాడు. నందిని రెడ్డి డైరెక్షన్ లో నాగ చైతన్య ఒక సినిమా చేయాల్సి ఉంది.