పెళ్లి చేసుకున్న హీరోయిన్


Aarti chabria
Aarti chabria

ఎవరికీ చెప్పాపెట్టకుండా ఎట్టకేలకు 36 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది హీరోయిన్ ఆర్తి చాబ్రియా . తెలుగులో గోపి గోడమీద పిల్లి , ఒకరికి ఒకరు , ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి , చింతకాయల రవి తదితర చిత్రాల్లో నటించిన భామ కు తెలుగులో అంతగా సక్సెస్ లభించలేదు . అలాగే హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించింది కానీ అక్కడ కూడా అంతే దాంతో చాలాకాలంగా కనిపించకుండా పోయిన ఆర్తి ఎట్టకేలకు 36 ఏళ్లకు పెళ్లి చేసుకుంది

36 పూర్తయి 37 లోకి అడుగుపెట్టే సమయంలో టాక్స్ కన్సల్టెంట్ అయిన విశారద్ ని పెళ్లి చేసుకుంది ఆర్తి చాబ్రియా . అంతర్జాతీయ స్థాయి టాక్స్ కన్సల్టెంట్ గా  పనిచేస్తున్న విశారద్ తో పెళ్లి కావడంతో త్వరలోనే ముంబయికి మకాం మారుస్తాడని అంటోంది ఆర్తి .విశారద్ ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టమని అంటోంది ఆర్తి . లేటు వయసులో అయినా పెళ్లి కావడంతో సినీ పెద్దలంతా ఆశీర్వదిస్తున్నారు