పొద్దున్న.. మధ్యాహ్నం.. సాయంత్రం.. టీజర్లు


Ravi Babu’s Aaviri Teaser
పొద్దున్న.. మధ్యాహ్నం.. సాయంత్రం.. టీజర్లు

నటుడు, దర్శకుడు “రవి బాబు” సినిమాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. మొదట కామెడీ ని నమ్ముకున్న రవి గారు నెమ్మదిగా సస్పెన్స్ థ్రిల్లర్, సైకో థ్రిల్లర్, హారర్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అలా అందరు తన సినిమాల కోసం తపించేలా చేసాయి. కొంతకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న రవి బాబు కి “ఆవిరి” ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చూద్దాం.

గతంలో లడ్డు బాబు, అవును 2, అదుగో సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలి అని గట్టిగా ‘ఆవిరి‘ సినిమా మీద భారీ ఆశలతో ఉన్నాడు. ఎక్కడైనా సినిమా ట్రైలర్ అంటే ఒకటి రిలీజ్ చేస్తారు కానీ రవి బాబు గారు పొద్దున్న ట్రైలర్ 1, మధ్యాహ్నం ట్రైలర్ 2, సాయంత్రం ట్రైలర్ 3 ప్లాన్ చేసారంటా. మొత్తానికి ఈ సారి కూడా సినిమా ప్రమోషన్ విషయంలో ఎప్పటిలాగానే తన పంధా మార్చుకోకుండా తన స్టైల్ లో చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు ఫిలిం నగర్లో.

సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహిస్తున్నారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ నిర్మాతలుగా సినిమాని నిర్మిస్తున్నారు. రవి బాబు , నేహా చౌహన్, శ్రీ ముక్త ,భరణి శంకర్, ముఖ్తర్ ఖాన్ ఇతర తారాగణం. మరి చూద్దాం పొద్దున్న ట్రైలర్ చూసేసాం అది చూస్తుంటే మళ్ళి అవును సినిమాని తలపిస్తుంది, సినిమాకి కొనసాగింపుగా అవును 3 అని పెడితే బాగోదు అని ఆవిరి అని పెట్టినట్లుగా అందరూ భావిస్తున్నారు. ఇక మధ్యాహ్నం, సాయంత్రం ట్రైలర్ అన్ని కలిపి చూస్తే మనకి అర్ధం కావచ్చు.