ఆయుష్మాన్ బాలా వీరబాదుడు


aayushman khurrana bala creating sensation at box office
aayushman khurrana bala creating sensation at box office

ఈ ఇండస్ట్రీలో ఎదగాలంటే హిట్లు కొట్టడం మాత్రమే కాదు, ఎంత కన్సిస్టెంట్ గా కొడుతున్నాం అన్నది కూడా ముఖ్యమే. ఒక హిట్ కొట్టి వెంటనే ఒక ప్లాప్ పడితే ఆ హీరోపై ఉన్న బజ్ పూర్తిగా పోతుంది. కాబట్టి ఇక్కడ వరసగా హిట్లు కొట్టిన వాడికే క్రేజ్ ఉంటుంది. వాడి వెనకాలే నిర్మాతలు, దర్శకులు పడుతుంటారు. తెలుగులో అలాంటి హీరో ఎవరున్నారో ఆలోచించొచ్చు కానీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా దుమ్మురేపుతున్నాడు. కన్సిస్టెన్సీ అంటే అలాంటిది ఇలాంటిది కాదు వరసగా ఆరు చిత్రాలు సూపర్ హిట్స్ కొట్టాడు. ఆయుష్మాన్ నటించిన గత మూడు చిత్రాలూ 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాయి. మిడ్ రేంజ్ హీరోలలో ఆయుష్మాన్ అంత కన్సిస్టెంట్ గా హిట్లు కొట్టేవారు బాలీవుడ్ లో ఎవరూ లేరు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హీరో గురించే చర్చ. ఈ హీరో కథల ఎంపిక ఇంత బాగా ఎలా ఉంటోందోనని అర్ధం కాక మిగతా మిడ్ రేంజ్ హీరోలు. తలలుపట్టుకుంటున్నారు.

కన్సిస్టెంట్ గా హిట్లు కొట్టడం మాత్రమే కాదు, తక్కువ వ్యవధిలో సినిమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ ఏడాది డ్రీం గర్ల్ తో 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ఆయుష్మాన్ ఇప్పుడు బాలా చిత్రంతో దుమ్ము రేపుతున్నాడు. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల మార్క్ ను దాటిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. బట్టతల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తోంది.

మధ్య తరగతి ప్రజల సమస్యలపై ఎక్కువగా సినిమాలను ఎంచుకునే ఆయుష్మాన్ ఇప్పుడు వారిలో సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఆయుష్మాన్ సినిమా అంటేనే అందులో ఏదో విషయం ఉంటుందన్న అభిప్రాయానికి జనాలు వచ్చేసారు. ఆయుష్మాన్ తో సినిమా చేస్తే అది కచ్చితంగా హిట్ అవుతుందన్న అభిప్రాయానికి నిర్మాతలు వచ్చేసారు. కంటెంట్ ఉన్న సినిమాలకు పూర్తి న్యాయం చేస్తాడన్న అభిప్రాయానికి దర్శకులు వచ్చేసారు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ ఖురానా తదుపరి చిత్రాలపై ఫోకస్ మరింత పెరిగింది.