బిగ్ బాస్ 4: బిగ్ బాస్ కు వెళ్లేముందు అభిజీత్ నాకు కాల్ చేసాడు – వర్షిణి


బిగ్ బాస్ 4: బిగ్ బాస్ కు వెళ్లేముందు అభిజీత్ నాకు కాల్ చేసాడు - వర్షిణి
బిగ్ బాస్ 4: బిగ్ బాస్ కు వెళ్లేముందు అభిజీత్ నాకు కాల్ చేసాడు – వర్షిణి

బిగ్ బాస్ 4 లో ఇప్పుడు టాప్ కంటెస్టెంట్ ఎవరు అని అడిగితె కచ్చితంగా మెజారిటీ భాగం మంది చెప్పే పేరు అభిజీత్. ఎప్పుడూ చాలా కూల్ గా ఉండే అభిజీత్ హౌజ్ లో చాలా యాక్టివ్. ఫీజికల్ టాస్క్ లలో కొంత వెనకబడి ఉండే అభిజీత్ ఇప్పుడు దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇక మైండ్ గేమ్ ఆడడంలో అభి తర్వాతే ఎవరైనా. కొన్ని టాస్క్ లను తన తెలివితో అభి మార్చిన తీరు అమోఘం. అయితే తనకు నెగేటివ్స్ కూడా ఉండనే ఉన్నాయి. ఎదుటి వాళ్ళను తక్కువ చేసి చూస్తాడని, ఎక్కువగా మనిషి వెనకాల మాట్లాడతాడని అంటుంటారు.

ఇక అభిజీత్ తో పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ లో నటించిన వర్షిణి తన గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అభిజీత్ తనకు మంచి స్నేహితుడని, బిగ్ బాస్ కు వెళ్లేముందు తనకు కాల్ చేసినట్లుచెప్పింది. బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది. ఒప్పుకోనా అని నాకు కాల్ చేసాడు. నీకు బిగ్ బాస్ కచ్చితంగా ఉపయోగపడుతుంది, ఒప్పుకో అని చెప్పాను.

నాకు తెలిసి అభిజీత్ విన్నర్ అవుతాడు అని వర్షిణి అంటోంది.