అభిమన్యుడు 3 రోజుల కలెక్షన్లు


Abhimanyudu 3 days Box Office Collectionsవిశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు తెలుగునాట మంచి వసూళ్ల ని సాధిస్తూ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది . మిత్రన్ దర్శకత్వంలో విశాల్ నటించి , నిర్మించిన అభిమన్యుడు 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది . ఓ డబ్బింగ్ సినిమా దాదాపుగా ఆరున్నర కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధిచిందంటే ఆ సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో యిట్టె అర్ధం చేసుకోవచ్చు . డిజిటల్ ఇండియా , సైబర్ క్రైమ్ ల నేపథ్యంలో తెరకెక్కిన అభిమన్యుడు అప్పుడే మూడు కోట్ల షేర్ సాధించాడు . ఏరియాల వారీగా అభిమన్యుడు సాధించిన గ్రాస్ వసూళ్లు ఇలా ఉన్నాయి .

నైజాం – 2. 88 కోట్లు
సీడెడ్ – 68 లక్షలు
కృష్ణా – 57 లక్షలు
గుంటూరు – 54 లక్షలు
వెస్ట్ – 25 లక్షలు
ఉత్తరాంధ్ర – 75 లక్షలు
ఈస్ట్ – 40 లక్షలు
నెల్లూరు – 28 లక్షలు
మొత్తం – 6. 35 కోట్లు