అభినేత్రి 2 వాయిదాపడిందితమన్నా – ప్రభుదేవా జంటగా నటించిన ” అభినేత్రి 2” చిత్ర విడుదల వాయిదాపడింది . తమిళ దర్శకులు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 1 న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు . అయితే ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ముందు చాలా సినిమాలు నిలవలేక పోతున్నాయి . దాంతో పలు చిత్రాలు విడుదల ఆగిపోయాయి . ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అభినేత్రి 2 కూడా చేరింది .

తమన్నా – ప్రభుదేవా జంటగా నటించిన అభినేత్రి 2016 లో విడుదల అయ్యింది . పెద్ద హిట్ ఏమి కాదు కానీ మంచి వసూళ్ల నే సాధించింది దాంతో ఆ సినిమాకు సీక్వెల్ గా అభినేత్రి 2 తీశారు చడీ చప్పుడు కాకుండా . సినిమా రిలీజ్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసేవరకు ఎలాంటి విషయం బయటకు పొక్కనీయలేదు . ఇక ఈ సీక్వెల్ లో ప్రభుదేవా , తమన్నా , సోనూ సుద్ లతో పాటుగా నందిత శ్వేత కూడా నటించింది . మే 31 న అభినేత్రి 2 రిలీజ్ కానుంది .