అమితాబ్ స‌తీమ‌ణి జ‌యా బ‌చ్చ‌న్ ఎక్క‌డున్నారు?


అమితాబ్ స‌తీమ‌ణి జ‌యా బ‌చ్చ‌న్ ఎక్క‌డున్నారు?
అమితాబ్ స‌తీమ‌ణి జ‌యా బ‌చ్చ‌న్ ఎక్క‌డున్నారు?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఎక్క‌డ చూసినా.. ఏ దేశం గురించి విన్నా క‌రోనా క‌థ‌నాలే. ప్ర‌పంచం ఎదుర్కొంటున్న అంత్యం విషాద‌క‌ర‌మైన విప‌త్తు ఇద‌ని అంత‌ర్జాతీయ ఆరోగ్య సంస్థ ఇప్ప‌టికే ప‌లు మార్లు ప్ర‌పంచ దేశాల‌ని హెచ్చ‌రించింది. దీంతో త‌మ దేశ ప్ర‌జ‌ల‌ని ఈ మ‌హ‌మ్మారి నుంచి కాపాడుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

దీంతో కొంత మంది ఇబ్బంది ప‌డుతున్నా ల‌క్ష‌ల్లో ప్ర‌జ‌లు సుర‌క్షితంగా వున్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లంతా ముక్త కంఠంతో ఆమోదిస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా విదేశాల్లో కొంత మంది ఇరుక్కుపోతే దేశంలో ఓ రాష్ట్రంలోని వారు మ‌రో రాష్టంలో ఇరుక్కుపోవ‌డం కొంత మందిని బాధిస్తోంది. తాజాగా బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అబితాబ్ బ‌చ్చ‌న్ స‌తీమ‌ణి జ‌యాబ‌చ్చ‌న్‌ ప్ర‌స్తుతం కుటుంబానికి దూరంగా ఢిల్లీలో వుంటున్నార‌ట‌. కార‌ణం లాక్‌డౌన్ వ‌ల్ల ఆమె అక్క‌డ స్ట్ర‌క్క‌యిపోవ‌డ‌మేన‌ని తెలిసింది.

గురువారం జ‌యాబ‌చ్చ‌న్ 72వ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా త‌న త‌ల్లిని గుర్తు చేసుకుంటూ ఇన్ స్టాలో ఓ ఫొటోని షేర్ చేసి అభిశేక్ బ‌చ్చ‌న్ పెట్టిన పోస్ట్ నెటిజ‌న్స్‌ని ఎమోష‌న్‌కి గురిచేస్తోంది. త‌మ‌కు ఎంతో ఇష్ట‌మైన ప‌దం `అమ్మ‌` అని ప్ర‌తి చిన్నారి చెబుతారు. హ్యాపీ బ‌ర్త్‌డే మా..లాక్‌డౌన్ కార‌ణంగా నువ్వు ఢిల్లీలో మేము ముంబాయితో వుండాల్సి వ‌చ్చింది. నీ గురించి మీము ఆలోచిస్తుంటామ‌ని నీకు తెలుసు. నువ్వు ఎప్ప‌టికీ మా గుండెల్లోనే వుంటావు. ల‌వ్ యూ మా.. అని అభిషేక్ షేర్ చేసిన పోస్ట్‌కు నెటిజ‌న్స్ కూడా ఎమోష‌న్ అవుతున్నారు.

Credit: Instagram