ఛత్రపతి ని హిందీలో రీమేక్ చేస్తారా


abhishek bachchan eyes on prabhas chatrapathiబాలీవుడ్ లో రీమేక్ చేయాల్సి వస్తే ఛత్రపతి సినిమాని చేస్తానని , ఆ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని అంటున్నాడు అభిషేక్ బచ్చన్ . బిగ్ బి తనయుడైన అభిషేక్ సినిమాల్లోకి వారసుడిగా ఎంటర్ అయ్యాడు కానీ అమితాబ్ స్థాయిని మాత్రం అందుకోలేకపోతున్నాడు . ఎన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది దాంతో దాదాపు రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు కట్ చేస్తే మళ్ళీ బిజీ అయ్యాడు సినిమాల్లో .

అయితే ఈ హీరో తరచుగా తెలుగు సినిమాలు చూస్తూనే ఉంటాడట ! అందరి హీరోల సినిమాలు చూస్తానని అయితే నాకు మాత్రం ఛత్రపతి సినిమా చాలాబాగా నచ్చిందని అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని అందుకే ఆ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని అంటున్నాడు అభిషేక్ బచ్చన్ . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి చిత్రంలో ప్రభాస్ – శ్రియా జంటగా నటించిన విషయం తెలిసిందే . 2005 లో విడుదలైన ఛత్రపతి సంచలన విజయం సాధించింది దాంతో ప్రభాస్ రేంజ్ కూడా అనూహ్యంగా పెరిగింది ఆ సినిమాతోనే . సెంటిమెంట్ , యాక్షన్ , రొమాన్స్ , లవ్ , ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్నీ సమపాళ్ళలో కలిసిన చిత్రం ఛత్రపతి .

English Title: abhishek bachchan eyes on prabhas chatrapathi

abhishek bachchan eyes on prabhas chatrapathi