“ఏజెంట్ ఆత్రేయ” ను కాపీ కొడుతున్నఅభిషేక్.?Abhishek Bachchan’s new movie launched
Abhishek Bachchan’s new movie launched

మనకు పాత కాలంలో ఒక సామెత ఉంది. ఒక పుస్తకాన్నిఇంకొక పుస్తకంలో నుంచి, ఒక సినిమాని ఇంకొక సినిమాలో నుండి దించితే దాన్ని కాపీ అంటారు. అదే ఏదైనా కొత్త పుస్తకాన్ని పది పుస్తకాల్లోంచి చూసి రాస్తే, కొత్త సినిమాను పది సినిమాల నుంచి చూసి తీస్తే దానికి ఇన్స్పిరేషన్, రీసెర్చ్, స్ఫూర్తి పొందడం అనే చాలా పెద్ద పెద్ద పదాలు వస్తాయి. దొరికిన వారిని దొంగ అంటారు దొరకని క్రియేటర్ అంటారు. సినిమా ఇండస్ట్రీలో మనకి అలా తెలియని క్రియేటివ్ దొంగలు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బాలీవుడ్ లో ఎనిమిదేళ్ళ క్రితం సుజయ్ ఘోష్ దర్శకత్వంలో విద్యాబాలన్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం “కహాని”. ఆ సినిమాలో బాగా హిట్ అయిన క్యారెక్టర్ పేరు బాబ్ బిశ్వాస్.

ఆ క్యారెక్టర్ లోనటించిన ఆర్టిస్ట్ పేరు సాస్వత ఛటర్జీ. ప్రస్తుతం ఆ క్యారెక్టర్ పేరు అయిన “బాబ్ బిశ్వాస్” పేరుతో ఒక సినిమా తీస్తున్నారు. చిత్రాంగద సింగ్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ హీరో. ఈ చిత్రానికి దియా ఘోష్ దర్శకురాలు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కానీ ఈ సినిమాను గత ఏడాది తెలుగులో రిలీజ్ సంచలన విజయం నమోదు చేసిన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమా నుంచి కాపీ కొట్టారని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమానే పది సినిమాల నుంచి లేపారనుకుంటే నిజంగానే అభిషేక్ బచ్చన్ చేస్తున్న ఈ సినిమాను, ఆ సినిమా నుంచి స్ఫూర్తి తీసుకుంటే అంత కన్నా భావ దరిద్రం ఇంకోటి లేదు. ఏది ఏమైనా భారతదేశానికి ఒక హిమాలయ పర్వతం, ఒక గంగానది తర్వాత ఒక అమితాబచ్చన్ అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ మెగాస్టార్ తన కొడుకును మాత్రం నటుడిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అంత మహానుభావుడి కొడుకు కాపీ సినిమాలు చేయకుండా కొంచెం లేట్ అయినా, మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.