సంజు సినిమా యూనిట్ కి షాక్


abu salem sends legal notice sanju makers

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ గా వచ్చిన సంజు రికార్డుల మోత మోగిస్తూ 500 కోట్ల క్లబ్ లో చేరింది . రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే కాగా ఈ చిత్ర యూనిట్ కు లీగల్ నోటీసులు పంపించి షాక్ ఇచ్చాడు గ్యాంగ్ స్టర్ అబూ సలేం . ఇంతకీ ఈ గ్యాంగ్ స్టర్ సంజు యూనిట్ కు లీగల్ నోటీసులు ఎందుకు పంపాడో తెలుసా …. తన క్యారెక్టర్ పై సినిమాలో మచ్చ పడేలా తీసారని అసలు సంజయ్ దత్ ని నేను కలుసుకోలేదు అలాంటిది ఏకంగా ఏకే 56 నేనే సంజయ్ దత్ కు సమకూర్చినట్లు ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నాడు అబూ సలేం .

15 రోజుల్లో ఆ సీన్ తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాడు అబూ సలేం . 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు గ్యాంగ్ స్టర్ అబూ సలేం . ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న అబూ సలేం లాయర్ ద్వారా ఈ నోటీసు పంపాడు . మరి ఈ నోటీసు పై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి . నోటీసుల సంగతి ఎలా ఉన్నప్పటికీ సంజు మాత్రం సంచలన విజయం సాధించింది . ఇక వరుస ప్లాప్ లతో కెరీర్ అగమ్యగోచరంగా ఉన్న సమయంలో సంజు రణబీర్ కపూర్ కెరీర్ ని మలుపు తిప్పింది .

English Title: abu salem sends legal notice sanju makers