మెగాస్టార్ `ఆచార్య‌` బిజినెస్ సంచ‌ల‌నం సృష్టిస్తోందా?

మెగాస్టార్ `ఆచార్య‌` బిజినెస్ సంచ‌ల‌నం సృష్టిస్తోందా
మెగాస్టార్ `ఆచార్య‌` బిజినెస్ సంచ‌ల‌నం సృష్టిస్తోందా

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆచార్య` కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. మెగా ప‌వ‌ర్‌స్టార్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్ ప‌రంగా భారీ క్రేజ్ ఏర్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌లే ఈ చిత్ర రిలీజ్ డేట్‌తో పాటు టీజ‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. మే 13 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అప్ప‌టి నుంచి ఈ చిత్ర బిజినెస్‌పై వార్త‌లు షికారు చేస్తున్నాయి. ట్రేడ్ స‌ర్కిల్స్‌లో ఈ మూవీ హాట్ కేక్‌లా మారిన‌ట్టు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల కోసం సినిమా ప్ర‌ద‌ర్శిన‌ హక్కులను పొందటానికి చాలా మంది పంపిణీదారులు పోటీ పడుతున్నారు. తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్ర నైజాం హ‌క్కుల్ని వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్ ఫ్యాన్సీ రేట్‌కి ద‌క్కించుకున్న‌ట్టు తెలిసింది. నైజాంలో`క్రాక్‌`తో లాభాల బాట‌ప‌ట్టిన వ‌రంగ‌ల్ శ్రీనివాస్ `ఆచార్య` నైజాం హక్కులను ఫాన్సీ మొత్తానికి కొనుగోలు చేశారట‌.

`సర్కారు వారి పాట` నైజాం హ‌క్కుల్ని కూడా వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్ సొతం చేసుకున్నార‌ని, మైత్రి మూవీ మేకర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. `క్రాక్` విడుదల సమయంలో దిల్ రాజుకు వ‌రంగ‌ల్ శ్రీనుకు మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే.
వరంగల్ శ్రీను `ఆచార్య` నిర్మాతలకు నైజాం హ‌క్కుల కోసం 42 కోట్లు ఆఫ‌ర్ చేశార‌ట‌. ఇది దిల్ రాజు మొదట్లో నిర్మాతలకు ఇస్తాన‌న్న మొత్తం కంటే ఎక్కువగా తెలుస్తోంది. దీంతో ఆంధ్రా, సీడెడ్‌ల‌లోనూ ఈ చిత్రానికి భారిగా డిమాండ్ ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది. ఆంధ్రా 60 అని, సీడెడ్ 20 అని నిర్మాత‌లు డిమాండ్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

నిరంజన్ రెడ్డి సహకారంతో కొనిదేలా ప్రొడక్షన్స్ కంపెనీ ఆధ్వర్యంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రముఖ మహిళగా, సోను సూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు.