ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది ఆరోజే!


Acharya first look on auspicious day
Acharya first look on auspicious day

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ సినిమా టైటిల్ ఆచార్య అన్న విషయం కొన్ని రోజుల క్రితమే లీకైన విషయం తెల్సిందే. చిరంజీవి స్వయంగా ఒక సినిమా వేదికపై ఈ టైటిల్ అనుకోకుండా బయటకు చెప్పేసారు. 90ల కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న సమయంలో కరోనా భూతం కారణంగా బ్రేక్ పడింది. పరిస్థితులు చూస్తుంటే మరో నెల రోజుల దాకా షూటింగ్ ఉండే అవకాశమే లేదు. మొదట ఉగాది సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ప్రేక్షకులతో పంచుకోవాలనుకున్నారు కానీ ఎందుకనో వెనక్కి తగ్గారు.

టైటిల్ రివీల్ అయినా కానీ, చిరంజీవి లుక్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినా కానీ ఫస్ట్ లుక్ అనేసరికి ఎక్కడో తెలియని ఆత్రుత అభిమానుల్లో ఉండడం సహజం. ఈ నేపథ్యంలో ఆచార్య ఫస్ట్ లుక్ విడుదలకు తేదీ వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆచార్య ఫస్ట్ లుక్ ను శ్రీరామనవమి రోజున అంటే ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెల్సిందే.  ముందుగా మహేష్ బాబుతో అనుకున్నా చివరికి రామ్ చరణ్ చేస్తేనే కరెక్ట్ అని ఫీలయ్యారు. ఇందులో దాదాపు 30 నిమిషాల పాటు కనిపించే పాత్రలో రామ్ చరణ్ అలరించనున్నాడు. చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో సీన్స్ మెగా ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయని అంటున్నారు.

ఇక ఈ సినిమాకు మొదట త్రిషను కథానాయికగా ఎంపిక చేసారు. అయితే దర్శకుడితో విబేధాల కారణంగా త్రిష ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రెజీనా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఇయర్ ఎండ్ లో ఆచార్య విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.