ఆచార్య – సెంటిమెంట్ ప్రకారం ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లే?

ఆచార్య - సెంటిమెంట్ ప్రకారం ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లే?
ఆచార్య – సెంటిమెంట్ ప్రకారం ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని వీలైనంత తొందర్లో పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది.

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపిస్తాడు. దాదాపు అరగంట నిడివున్న పాత్రలో రామ్ చరణ్ మెరుపులు మెరిపిస్తాడని అర్ధమవుతోంది. చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ కు జోడి ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆచార్య రిలీజ్ డేట్ పై ఊహాగానాలు మొదలయ్యాయి.

మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. సెంటిమెంట్ ప్రకారం ఈ డేట్ అయితే పెర్ఫెక్ట్ గా ఉంటుందని అనుకుంటున్నారు. ఇదే రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి గ్యాంగ్ లీడర్ చిత్రాలు విడుదలయ్యాయి. అవి ఎంత పెద్ద హిట్స్ సాధించాయో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ఆచార్యను కూడా ఇదే రోజు విడుదల చేయాలని భావిస్తున్నారు.