పుష్ప సెట్స్ లో రామ్ చరణ్ ఏం చేస్తున్నట్లు?

పుష్ప సెట్స్ లో రామ్ చరణ్ ఏం చేస్తున్నట్లు?
పుష్ప సెట్స్ లో రామ్ చరణ్ ఏం చేస్తున్నట్లు?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూర్తి మేకోవర్ లోకి వెళ్ళిపోయాడు. అల వైకుంఠపురములో వంటి క్లాస్ హిట్ తర్వాత పుష్ప చిత్రం ద్వారా కంప్లీట్ మాస్ రోల్ లోకి మారిపోయాడు బన్నీ. సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 13న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ రంపచోడవరం అడవుల్లో కొనసాగించిన విషయం తెల్సిందే. రెండు భారీ షెడ్యూల్స్ ను ఇక్కడే పూర్తి చేసారు. నవంబర్ లో ఒక షెడ్యూల్, జనవరిలో మరో షెడ్యూల్ ను పూర్తి చేసారు.

రెండు భారీ షెడ్యూల్స్ తో దాదాపు ఫస్ట్ హాఫ్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇప్పుడు పుష్ప టీమ్ హైదరాబాద్ చేరుకుంది. కొన్ని రోజుల బ్రేక్ అనంతరం ఫ్రెష్ షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తారు. అల్లు అర్జున్ ఇప్పుడు హాలిడేకు వెళ్ళాడు.

ఇదిలా ఉంటే మారేడుమిల్లిలో వేసిన పుష్ప సెట్స్ ను అలానే ఉంచారు. ఇదే సెట్స్ కు చిన్న చిన్న మార్పులు చేసి ఆచార్య షూటింగ్ ను అక్కడ చేస్తారట. రామ్ చరణ్ ఈ షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది.