అవ‌న్నీ రూమ‌ర్సే అంటున్నారు!అవ‌న్నీ రూమ‌ర్సే అంటున్నారు!
అవ‌న్నీ రూమ‌ర్సే అంటున్నారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై మెగా ప‌వ‌ర్‌స్టార్  రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌తో 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మ‌రో కీల‌క షెడ్యూల్ ప్రారంభః కావాల్సి వుంది.

అయితే కారోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో షూటింగ్‌లు ఆగిపోయిన విష‌యం తెలిసిందే. ఇదే క్ర‌మంలో చిరంజీవి సినిమా షూటింగ్ కూడా వాయిదా ప‌డింది. ఈ సినిమాలో ముందు త్రిష‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆమె ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంది. ఆమె స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేశారు.

అయితే బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఆమె కూడా ఈ చిత్రం నుంచి త‌ప్పుకోబోతోంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం మొద‌లైంది. ఈ వార్త‌ల‌పై చిత్ర టీమ్ స్పందించిన‌ట్టు తెలిసింది. కాజ‌ల్ అ చిత్రం నుంచి త‌ప్పుకుంటోంద‌న్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, అవ‌న్నీ నిరాదార‌మైన వార్త‌ల‌ని, లాక్ డౌన్ త‌రువాత ప‌రిస్థుల‌ని బ‌ట్టి సినిమా షెడ్యూల్ వుంటుంద‌ని, కాజ‌ల్ అందులో పాల్గొంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు క్లారిటీ ఇచ్చిన‌ట్టు తెలిసింది.