దసరా రేసులోకి మెగాస్టార్ ఆచార్య?

దసరా రేసులోకి మెగాస్టార్ ఆచార్య?
దసరా రేసులోకి మెగాస్టార్ ఆచార్య?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ను జులై మొదటి వారం నుండి తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. మరో 30 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ నేపథ్యంలో జులై నెల మొత్తం ఏకధాటిగా షూటింగ్ చేసి నెలాఖరుకి ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు.

ఇప్పటికే కొరటాల శివ ఈ చిత్రం కోసం చాలా సమయం కేటాయించాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆచార్యను దసరా సీజన్ లో విడుదల చేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన కూడా టీమ్ చేస్తోంది.

ఆచార్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తోన్న చిత్రం. కాబట్టి హాలిడే సీజన్ అనేది చాలా ముఖ్యం. దసరా అయితే పెర్ఫెక్ట్ గా ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ పై అనిశ్చితి నెలకొని ఉంది. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియడానికి మరికొంత సమయం తప్పక పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.