ప్రభాస్ కు అసలైన అగ్ని పరీక్ష ఆగస్టులో


ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రం ఆగస్టు 15 న విడుదల కానుంది . దాంతో అసలు పరీక్ష మొదలు కానుంది ప్రభాస్ కు . ఎందుకంటే బాహుబలి , బాహుబలి 2 చిత్రాలతో ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగింది . అయితే దానికి రాజమౌళి అండగా ఉన్నాడు అప్పుడు కానీ ఇప్పుడు ఉంది ఓ యువ దర్శకుడు సుజిత్ మాత్రమే !

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో చిత్రం రూపొందుతోంది . అయితే ఆ రేంజ్ వసూళ్లు సాధించే సత్తా ప్రభాస్ కు ఉందా ? అన్నది ఇప్పుడు సవాల్ గా మారుతోంది . ప్రభాస్ సాహో తో హిట్ కొడితే నిజంగానే ఆ రేంజ్ కి చేరుకున్నట్లు అవుతుంది లేదంటే కేవలం రాజమౌళి వల్లే అనే విషయం బోధపడుతుంది . దాంతో ప్రభాస్ కు ఆగస్టు నెల సవాల్ గా మారింది . అగ్ని పరీక్ష గా మారింది . పైగా మరో సెంటిమెంట్ కూడా ఉంది రాజమౌళి దర్శకత్వంలో నటించి బ్లాక్ బస్టర్ కొట్టాక ఆ హీరో కు వరుసగా ప్లాప్ లు వచ్చి పడుతున్నాయి తప్ప సక్సెస్ రాలేదు . ఇప్పటివరకు నటించిన హీరోలందరిది ఇదే పరిస్థితి మరి . దాన్ని ప్రభాస్ అధిగమిస్తాడా చూడాలి .