అది నాకు గోల్డెన్ ఆఫ‌ర్‌!

అది నాకు గోల్డెన్ ఆఫ‌ర్‌!
అది నాకు గోల్డెన్ ఆఫ‌ర్‌!

`స‌వ్య‌సాచి` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగ‌ర్వాల్‌. ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ఈ మూవీ త‌రువాత చేసిన `మిస్ట‌ర్ మ‌జ్ను` కూడా అదే స్థాయిలో విఫ‌లం కావ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ నిధి అగ‌ర్వాల్ `ఇస్మార్ట్ శంక‌ర్` బంప‌ర్ హిట్‌ని అందించింది. ప్ర‌స్తుతం మ‌హేష్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రంలో న‌టిస్తున్న నిధికి తాజాగా గోల్డెన్ ఆఫ‌ర్ ల‌భించింది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌‌స్తుతం మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా రూపొందుతున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ఈ మూవీతో పాటు క్రిష్ తెర‌కెక్కిస్తున్న పిరియాడిక్ చిత్రంలోనూ న‌టిస్తున్నారు. ఏ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది.

ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్‌ని ఎంపిక చేశారు. ఈ మూవీ గురించి నిధి అగ‌ర్వాల్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. `నేను ప‌వ‌న్‌కల్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ ప్ర‌త్యేక‌మైన ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డం ఓ క‌ల‌లా వుంది. ఇదినా తొమ్మిద‌వ చిత్రం. నా కెరీర్‌కిది గోల్డెన్ ఫిల్మ్ అవుతుంది. ప‌వ‌న్ స‌ర్‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి ఆతృత‌గా ఎదురుచూస్తున్నాను` అని తెలిపింది.