యాక్ష‌న్ కింగ్ డైరెక్ష‌న్‌లో అక్కినేని హీరో?


యాక్ష‌న్ కింగ్ డైరెక్ష‌న్‌లో అక్కినేని హీరో?
యాక్ష‌న్ కింగ్ డైరెక్ష‌న్‌లో అక్కినేని హీరో?

యాక్ష‌న్ కింగ్ అర్జున్ కి హీరోగా ఎంత మంది పేరుందో ద‌ర్శ‌కుడిగా కూడా అంతే మంచి పేరుతో పాటు మంచి హిట్‌లు కూడా వున్నారు. గ‌త కొంత కాలంగా డైరెక్ష‌న్‌కి దూరంగా వున్న యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్వ‌ర‌లో మ‌ళ్లీ డైరెక్ష‌న్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లో ఆయ‌న తెలుగు సినిమా చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల అర్జున్ అక్కినేని వార‌బ్బాయి నాగ‌చైత‌న్య‌కు క‌థ చెప్పిన‌ట్టు తెలిసింది. స్టోరీ ఇంప్రెసీవ్‌గా వుండ‌టంతో చై గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. అయితే ఇంకా ప్రాజెక్ట్‌పై మాత్రం సంత‌కం చేయ‌లేద‌ని తెలిసింది. నాగ చైత‌న్య ప్ర‌స్తుతం సెన్పిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ల‌వ్‌స్టోరీ` చిత్రంలో న‌టిస్తున్నాడు.

ఇటీవ‌లే `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న `థ్యాక్యూ` చిత్రాన్ని ఒకే చేశారు. ఈ మూవీ ఇటీవ‌లే లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ నేప‌థ్యంలో చైతో యాక్ష‌న్ కింగ్ అర్జున్ చేయాల‌నుకుంటున్న మూవీ  కోసం చాలా టైమ్ ప‌ట్టేలా వుంది. అందుకు అర్జున్ రెడీగానే వున్నార‌ట‌. ఈ మూవీ ద్వారా త‌న కూతురు ఐశ్వ‌ర్య‌ని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాట‌.