`మాస్ట‌ర్‌` ట్రైల‌ర్ ఊర‌మాస్ అంట‌!


`మాస్ట‌ర్‌` ట్రైల‌ర్ ఊర‌మాస్ అంట‌!
`మాస్ట‌ర్‌` ట్రైల‌ర్ ఊర‌మాస్ అంట‌!

విజ‌య్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `మాస్ట‌ర్‌`. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్జేవియ‌ర్ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళ‌వికా మోహ‌న‌న్‌, ఆండ్రియా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి, అర్జున్‌దాస్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్ర రిలీజ్ విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొంది.

లాక్‌డౌన్ త‌రువాత పరిస్థితుల‌ని బ‌ట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే తాజా ప‌ర‌స్థితుల్లో థియేట‌ర్లు ఓపెన్ అయ్యే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. దీపావ‌ళికి వ‌ర‌కు ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేద‌ని, ఈ చిత్రాన్ని దీపావ‌ళికి రిలీజ్ చేయోచ్చ‌న్న‌ది తాజా టాక్‌. ఇదిలా వుంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ రిలీజ్‌పై న‌టుడు అర్జున్‌దాస్ తాజాగా స్పందించారు.

`ఇప్ప‌టికే నేను ఆరు సార్లు ట్రైల‌ర్ చూశాన‌ని, ట్రైల‌ర్ ఊర‌మాస్‌గా వుంద‌ని, సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన త‌రువాతే ట్రైల‌ర్ రిలీజ్ చేస్తార‌ని, మీ నిరీక్ష‌ణ‌కు త‌గ్గ‌ట్టే సినిమా ఓ రేంజ్‌లో వుంటుంద‌ని, ట్రైల‌ర్‌లో విజ‌య్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలుస్తుంద‌ని, స‌రైన స‌మ‌యంలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తార‌ని అర్జున్ దాస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.