కేసీఆర్ పై మండిపడుతున్న బాబూమోహన్Babumohan and KCR
Babumohan and KCR

మాజీ మంత్రి , సినీ నటుడు బాబూమోహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు . ప్రభుత్వాన్ని ఎలా నడపాలో చేతకాక భారతీయ జనతా పార్టీ మీద అక్కసు వెళ్లగక్కుతున్నారని , ఒకసారి ఓడిపోయినంత మాత్రానా ఇక పని అయిపోయిందని అనుకోవడం భ్రమే అవుతుందని చురకలు అంటించాడు . 2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడానికి కేసీఆర్ టికెట్ నిరాకరించాడు .

అంతేనా కనీసం టికెట్ ఇవ్వడం లేదని కనీస సమాచారం కూడా ఇవ్వలేదట దాంతో తీవ్ర అవమానంగా భావించిన బాబూమోహన్ టీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరాడు . ఇక త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న సందర్బంగా పెద్ద ఎత్తున బీజేపీ సభుత్వ నమోదు కార్యక్రమం చేపట్టాడు బాబూమోహన్ . మా తడాఖా ఏంటో మున్సిపల్ ఎన్నికల్లో చూపిస్తామని అంటున్నాడు . అలాగే కేసీఆర్ , కేటీఆర్ లకు ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో తెలీక బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు .