
ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. నగరంలోని ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్లు పడవలయ్యాయి. వందల సంక్షలో కార్లు వరదనీటిలో మునిగిపోయాయి. కొన్ని బైకులు కొట్టుకుపోయాయి. 70 మంది వరద ధాటికి గల్లంతయ్యారు. చాలా వరకు వారి ఆచూకీ కూడా తెలియదు.
మూడు రోజులవుతున్నా ఇప్పటికీ వర్షాలు తగ్గకపోవడంతో వరద నీరు చాలా ఇళ్లల్లోకి చేరింది. కొన్ని ఏరియాల్లోని ఇళ్లల్లోరి మోకాళ్ల లోతు వరకు నీరు చేరితే కొన్ని ఏరియాల్లో నడములోతు వరకు నీళ్లు చేరాయి. దీంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో వాటలు నిలిచిపోవడం వల్ల కరెంట్ కట్ చేశారు. దీంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఇంటిలోకి కూడా వరద నీరు చేరింది. ఇంటి ముందు గేటు సగం వరకు మునిగిపోయింది.
ఇంట్లోకి వరద నీరు చేరింది. దీనికి సంబంధించిన ఫొటోలని బ్రహ్మాజీ సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదుగో నా ఇల్లు అంటూ ఫొటోలని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలిసిన వాళ్లు అంతా క్షేమమే కదా? అంటూ ట్వీట్ చేస్తున్నారు. అయితే బ్రహ్మాజీ నుంచి మాత్రం ఎలాంటి రిప్లై రావడం లేదు. మణికొండ ఏరియాలో బ్రహ్మాజీ కి ఇండిపెండెంట్ హాస్ వుంది. అది ప్రస్తుతం వరదనీటిలో మునిగింది.