టాలీవుడ్ లో మరో విషాదం


actor Deekshithulu died

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది . రంగస్థల , సినిమా నటుడు అయిన దీక్షితులు ఈరోజు గుండెపోటుతో మరణించాడు . ఇటీవలే పలువురు మృత్యువాత పడగా తాజాగా డివి శ్రీనివాస దీక్షితులు మరణించాడు . దీక్షితులు పూర్తిపేరు డివి శ్రీనివాస దీక్షిత్ . మహేష్ బాబు హీరోగా నటించిన మురారి చిత్రం దీక్షితులు కు మంచి పేరు తీసుకొచ్చింది .

 

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన దీక్షితులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు . 1956 జూలై 28 న జన్మించాడు దీక్షితులు . రామకృష్ణా సినీ స్టూడియోస్ లో ఓ సీరియల్ షూటింగ్ కోసం వెళ్లిన దీక్షితులు కు సడెన్ గా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు . అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ద్రువీకరించడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది .

English Title: actor Deekshithulu died