బ్రేకింగ్: `మా` వైస్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజ‌శేఖ‌ర్ రాజీనామా!


Actor Dr.Rajasekhar resigned 
Actor Dr.Rajasekhar resigned

గురువారం ఉద‌యం నుంచి జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన హీరో యాంగ్రీ యంగ్‌మెన్ డా. రాజ‌శేఖ‌ర్ `మా` ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. గ‌త కొంత కాలంగా న‌రేష్ అధ్య‌క్షుడిగా ఏర్పాటైన `మా` కార్య వ‌ర్గంలో ఎన్నికైన తోలి రోజు నుంచే లుక లుక‌లు మొద‌ల‌య్యాయి. అవి చిలికి చిలికి గాలా వాన‌గా మారి న‌టీన‌టుల్లో వున్న విభేధాల్ని మీడ‌యా ముఖంగా బ‌య‌ట‌పెట్టాయి.

`మా` అధ్య‌క్షుడిగా  న‌రేష్ ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే స‌భ్యుల మ‌ధ్య నెల‌కొన్న లుక లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. త‌న ప్యాన‌ల్ స‌భ్యులంటూ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన అకధ్య‌క్షుడు న‌రేష్ మీడియా ముఖంగా హేమ‌ని మాట్లాడ‌నీయ‌కుండా మైకు లాక్కోవ‌డం అప్ప‌ట్లో ర‌చ్చ‌కు దారిలీసింది. ఆ త‌రువాత కూడా న‌రేష్ సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని, మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించ‌డం లేద‌ని స‌భ్యులు మీడియా ముఖంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

అధ్య‌క్షుడు లేకుండా స‌ర్వ‌స‌భ్య స‌మావేశాన్ని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా. రాజ‌శేఖ‌ర్,  జీవిత నిర్వ‌హించ‌డంతో `మా` గొడ‌వ‌లు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్ప‌డంటే ఇప్పుడే త‌న‌ని రాజీనామా చేయ‌మంటే చేసేస్తాన‌ని న‌రేష్ ప్ర‌క‌టించ‌డంతో చిరంజీవి రంగంలోకి దిగార‌ని అంత‌టా ప్ర‌చారం జ‌రిగింది. `మా`లో గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగాయ‌ని అనుకుంటున్న వేళ ఈ గురువారం `మా` డైరీ ఆవిష్క‌ర‌ణ సాక్ష‌గా మ‌ళ్లీ బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో వేదిక సాక్షిగా చిరంజీవి హీరో రాజ‌శేఖ‌ర్‌ని మంద‌లించ‌డంతో ఆయ‌న మ‌న‌స్థాపానికి గురై ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై డా. రాజ‌శేఖ‌ర్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తారో చూడాలి.