తండ్రి పైనే కేసు పెట్టిన నటుడి కూతురు


Actor Duniya Vijay' s daughter filed case against him

కన్న తండ్రి పైనే కన్న కూతురు కేసు పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. సంఘటన వివరాలలోకి వెళితే ….. వెండితెరపై విలన్ వేషాలు వేసే నటుడు దునియా విజయ్ పై అతడి కూతురు మౌనిక కేసు పెట్టింది. నా తండ్రి సినిమా జీవితంలో నే కాదు నిజ జీవితంలో కూడా నిజమైన విలన్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న నటుడు దునియా విజయ్ జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. కాగా కన్న కూతురు కన్న తండ్రిపై కేసు పెట్టడం మాత్రం సంచలనం అయ్యింది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దునియా విజయ్ కి ఈ సంఘటన పెద్ద దెబ్బే !

అయితే ఈ కేసుపై దునియా విజయ్ స్పందించి , మౌనిక కేసు పెట్టడానికి కారణం వాళ్ళ అమ్మ . ఆమె ప్రోద్బలంతో తప్పుడు కేసు పెట్టింది తప్ప నాపై కోపంతో కాదని , త్వరలోనే మా సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు . దునియా విజయ్ కి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య నాగరత్న కూతురు ఈ మౌనిక. నాగరత్నతో దునియా విజయ్ కి విభేదాలు రావడంతో ఆమెతో విడిపోయాడు . అయితే మోనిక పై దాడి చేసి కొట్టాడని కేసు పెట్టింది మౌనిక . దునియా విజయ్ చుట్టూ పలు వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలు ఎప్పుడు సద్దుమణిగుతాయో ! ఏంటో ?

English Title: Actor Duniya Vijay’ s daughter filed case against him