తాగి గొడవ చేసిన నటుడు


Actor huchha venkat hulchal bekeryతాగినమైకంలో గొడవ చేసిన నటుడు ప్రస్తుతం అజ్ఞాతవాసంలో ఉన్నాడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది . సంఘటన వివరాలలోకి వెళితే …… హుచ్చ వెంకట్ అనే కన్నడ నటుడు రాత్రంతా ఫుల్లుగా మద్యం తాగేశాడు , ఉదయమే లేచి అదే మత్తులో దగ్గరలోని ఓ బేకరీ లోకి వెళ్లి గొడవ చేసాడు దాంతో ఆ బేకరీ యజమాని తొలుత షాక్ అయినప్పటికీ ఆ తర్వాత తేరుకొని హుచ్చ వెంకట్ పై తిరగబడ్డాడు దాంతో హుచ్చ వెంకట్ బేకరీ లోని వస్తువులను కిందపడేసి అక్కడినుండి వెళ్ళిపోతున్న సమయంలో బేకరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సకాలంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హుచ్చ వెంకట్ ని హెచ్చరించి అక్కడి నుండి పంపించారు .

కన్నడంలో పలు చిత్రాల్లో నటించిన హుచ్చ వెంకట్ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నాడు . వివాదాస్పద వ్యక్తిత్వం కలిగిన హుచ్చ వెంకట్ అతిగా ప్రవర్తించడంతో ఈ సంఘటనలు జరుగుతున్నాయి . హుచ్చ వెంకట్ నటుడు కావడంతో కేసు పెట్టకుండా హెచ్చరించి పంపించారు పోలీసులు .

English Title: Actor huchha venkat hulchul bekery