సుహాసినికి మద్దతు ప్రకటించిన జగపతిబాబు


Actor jagapathi babu support nandamuri suhasini

నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కి మద్దతు ప్రకటించాడు నటుడు జగపతిబాబు . నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీ తరుపున కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి ప్రాంతం నుండి వ్యహాత్మకంగా చంద్రబాబు సుహాసిని ని బరిలో దింపాడు . నామినేషన్ రోజున బాలయ్య బాబాయ్ వెంటరావడంతో సుహాసిని తన గెలుపు నల్లేరు మీద నడకే అనుకుంది . ఇక ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున కూకట్ పల్లి వాసులు సుహాసినికి మద్దతు తెలుపుతుండటంతో చాలా సంతోషంగా ఉంది సుహాసిని .

ఇక సుహాసిని అభ్యర్థిత్వం పట్ల సినిమా రంగం నుండి పెద్దగా స్పందన లేకుండే ! కానీ నిశ్శబ్దాన్ని చీల్చుతూ నటుడు జగపతిబాబు తన పూర్తి మద్దతు సుహాసిని కే అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి పడేసాడు . అంతేకాదు సుహాసిని మంచి ప్రతిభాశాలి తప్పకుండా మన కూకట్ పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అందుకే నా ఓటు సుహాసినికె అంటూ సెలవిచ్చాడు జగపతిబాబు . సినిమా రంగం నుండే కాకుండా సీమాంధ్రులు , ఎన్టీఆర్ , బాలకృష్ణ , తెలుగుదేశం పార్టీ అభిమానులు సుహాసిని గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు .

English Title: Actor jagapathi babu support nandamuri suhasini