విలక్షణ నటుడు జాన్ కొట్టోలీ ఇక లేరు


విలక్షణ నటుడు జాన్ కొట్టోలీ ఇక లేరు
విలక్షణ నటుడు జాన్ కొట్టోలీ ఇక లేరు

“కళాకారుడు ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులందరి గురించి ఆలోచిస్తాడు.. ఒక తన గురించి తప్ప..!”. అని గతంలో ఒక మహానుభావుడు చెప్పాడు. నిజంగానే డ్యూటీ టైమింగ్స్ అంటూ సినిమా ఇండస్ట్రీలో ఉండవు. అది కూడా స్త్రగ్లింగ్ ఫేజ్ లో ఉన్న ఆర్టిస్ట్ లకు, టెక్నీషియన్ లకు ఒక్క అవకాశం గురించి చేసే పోరాటంలో ఆరోగ్య స్పృహ ఉండదు. కొన్నిసార్లు దురదృష్టవశాత్తూ కూడా అనారోగ్యం వారిని దెబ్బతీస్తుంది.

వెండితెర నటుడు జాన్ కొట్టోలీ గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన వయసు కేవలం 40 ఏళ్ళు. టాలీవుడ్ లో ఆయన చేసింది కొన్ని సినిమాలే అయినా విలక్షణనటుడిగా తన ముద్ర వేసారు. ముఖ్యంగా “ఫలక్ నామా దాస్”. “యుద్ధం శరణం”, “రక్తం” సినిమాల్లో  గుర్తుండిపోయేలా పాత్రలు చేసారు . రంగస్థల నటుడిగా ప్రయాణం మొదలెట్టిన ఆయన రచయితగా, దర్శకుడిగా కూడా రాణించారు.  బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన ఆయన దూరం అవ్వటం చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా పలువురు భావిస్తున్నారు. కేరళ నేపధ్యం ఉన్న జాన్ ప్రస్తుతం హైదరాబాద్ కూకట్ పల్లిలో నివసించేవారు. ఆయనకు భార్య మరియు తొమ్మిదేళ్ళ కుమార్తె ఉన్నారు.