న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్‌కు ఏమైందీ?

న‌టుడు న‌ర్సింగ్  యాద‌వ్‌కు ఏమైందీ?
న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్‌కు ఏమైందీ?

రామ్ గోపాల్‌వ‌ర్మ చిత్రాల్లో విల‌న్స్ గ్యాంగ్‌లో హెంచ్‌మెన్‌గా న‌టిస్తూ త‌న‌దైన తెలంగాణ యాస‌తో ఆక‌ట్టుకున్న న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వ‌రుకు దాదాపు అందిరితో క‌లిసి న‌టించారు. ఆయ‌న  ఉన్న‌ట్టుండి గురువారం సాయంత్రం అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయారు.

అయితే ఆయ‌న ఇంట్లో జారిప‌డ‌టం వ‌ల్ల త‌ల‌కు బ‌ల‌మైన గాయం అయింద‌ని, కుటుంబ స‌భ్యులు వెంట‌నే సోమాజీగూడాలో వున్న యశోదా ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ని వార్త‌లు వస్తున్నాయి. అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, త‌న భ‌ర్త జారి ప‌డిపోలేద‌ని, ఉన్న‌ట్టుండి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయార‌ని., ప్ర‌స్తుతం ఆయ‌న‌కు య‌శోద ఆస‌ప‌త్రిలో చికిత్స అందిస్తున్నామ‌ని, ఆయ‌న కోమాలోకి వెళ్లిన‌ట్టు డాక్ట‌ర్లు దృవీక‌రించార‌ని, 48 గంట‌లు గ‌డిస్తే గానీ ప‌రిస్థితి ఏంట‌నేది చెప్ప‌లేమ‌ని వెల్ల‌డించార‌ని  న‌ర్సింగ్ యాద‌వ్ భార్య స్ప‌ష్టం చేసింది.

అయితే ఆయ‌న కింద ప‌డిపోవ‌డం వ‌ల్ల త‌ల‌కు బ‌ల‌మైన గాయం అయింద‌ని, దాని వ‌ల్లే ఆయ‌న కోమాలోకి వెళ్లార‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఆ ప్ర‌చారం త‌ప్పు అని, త‌ను కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాల‌ని అంతా కోరుకోండి కానీ ద‌య‌చేసి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌కండ‌ని న‌ర్సింగ్ యాద‌వ్ స‌తీమ‌ణి విజ్ఞ‌ప్తి చేశారు.