సినీ న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్ క‌‌న్నుమూత‌

సినీ న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్ క‌‌న్నుమూత‌
సినీ న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్ క‌‌న్నుమూత‌

సినీ న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్ (52) క‌న్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ య‌షోద ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న అక్క‌డ గ‌త కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయ‌న గుండెపోటు రావ‌డంతో తుది శ్వాస విడిచారు. ప‌లు చిత్రాల్లో కమెడియ‌న్‌గా, విల‌న్‌ల‌కు స‌హాయ‌కుడి పాత్ర‌ల్లో న‌టించిన న‌ర్సింగ్ యాద‌వ్ ఆక‌ట్టుకున్నారు.

తెలుగుతో పాటు తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో క‌లిపి దాదాపు 300 చిత్రాల్లో న‌టించారు. న‌ర్సింగ్ అస‌లు పేరు మైలా న‌ర‌సింహ యాద‌వ్‌. ఇండ‌స్ట్రీలో అంతా ఆయ‌న‌ని న‌ర్సింగ్ యాద‌వ్ అని పిల‌వ‌డంతో అదే అస‌లు పేరుగా మారిపోయింది. న‌ర్సింగ్ యాద‌వ్ 1968 జ‌న‌వ‌రి 26న హైద‌రాబాద్‌లో జ‌న్మించారు. ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కుమారుడు రిత్విక్ యాద‌వ్ వున్నారు.

విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శ‌‌క‌త్వంలో రూపొందిన `హేమా హేమీలు` సినిమాతో న‌ర్సింగ్ యాద‌వ్ సినీ రంగ ప్ర‌వేశం చేశారు. ఆ త‌రువాత వ‌ర్మ రూపొందించిన చిత్రాల‌తో గుర్తింపుని ద‌క్కించుకున్నారు. రామ్‌గోపాల్‌వ‌ర్మ రూపొందించిన `క్ష‌ణ క్ష‌ణం`లో న‌ర్సింగ్ యాద‌వ్ చెప్పిన సీరియ‌స్ డైలాగ్‌లు కామెడీని పుట్టించిన విష‌యం తెలిసిందే. మాయ‌లోడు, అల్ల‌రి ప్రేమికుడు, ముఠామేస్త్రీ, మాస్ట‌ర్‌, గాయం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఇడియ‌ట్‌, పోకిరి, య‌మ‌దొంగ‌, జానీ, ఠాగూర్‌, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించారు.