హీరోయిన్ గాలి తీసేసిన పోసాని


హీరోయిన్ పూజా హెగ్డే గాలి తీసేసిన పోసాని

మహేష్ అందగాడు నేనే గనుక ఆడపిల్లనైతే పెళ్లి చేసుకునేంత వరకు వెంటపడేవాడిని అంటూ సరదాగా నవ్వించిన నటుడు పోసాని హీరోయిన్ పూజా హెగ్డే గాలి తీసేసాడు అదే వేదికపై . మహేష్ అందం ముందు పూజా హెగ్డే తేలిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు పోసాని . ఈరోజు మధ్యాహ్నం మహర్షి విజయోత్సవ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరిగింది

కాగా వేడుకలో పాల్గొన్న పోసాని మహేష్ బాబు అందంపై కామెంట్ చేస్తూ నేనే ఆడపిల్ల నైతే పెళ్లి చేసుకోమని వెంటపడేవాడిని , ఒకవేళ పెళ్లి చేసుకోక పోయినా పర్లేదు ఉంచుకోమని కోరేవాడ్ని అంటూ నవ్వించాడు . అయితే మహేష్ ని పొగిడే పనిలో పాపం ! పూజా హెగ్డే గాలి తీసేసాడు మహేష్ అందం ముందు పూజా వెలవెలబోయిందని . మే 9 విడుదలైన మహర్షి మంచి వసూళ్ల నే సాధిస్తోంది . అయితే దురదృష్టమో లేక గ్రహబలమో కానీ పూజా హెగ్డే నటించిన సినిమాలేవీ ఇంతవరకు బ్లాక్ బస్టర్ లు కాలేకపోయాయి పాపం .