పుకార్లపై స్పందించిన ప్ర‌భు!


పుకార్లపై స్పందించిన ప్ర‌భు!
పుకార్లపై స్పందించిన ప్ర‌భు!

సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా వెంటాడుతూనే వుంది. సెల‌బ్రిటీ, సామాన్యుడు అని తేడా లేకుండా ప్ర‌తీ ఒక్క‌రినీ పీడిస్తోంది. ఇక ఈ మ‌ధ్య అదిగో వైర‌స్ అంటే ఇదో అంటూ పుకార్లు పుట్టించ‌డం ఫ్యాష‌న్‌గా మారిపోయింది. ఏకంగా సెల‌బ్రిటీల‌కు క‌రోనా అంటూ ప్ర‌చారం చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.

తాజాగా త‌మిళ న‌టుడు ప్ర‌భుకు క‌రోనా సోకిందంటూ ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో ఆయ‌న త‌న‌కు క‌రోనా సోక‌లేద‌న‌రి వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. ఇటీవ‌ల త‌మిళ న‌టులు వ‌రుస‌గా క‌రోనాబారిన ప‌డుతున్నారు. విశాల్ ఆయ‌న ఫాద‌ర్ జీకె రెడ్డి క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత గాన గంధ‌ర్వుడు ఎస్పీబాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా బారిన ప‌డి కోల‌కున్న‌ట్టే కోలుకుని మృతి చెందిన విష‌యం తెలిసిందే.

తాజాగా నటుడు ప్ర‌భుకు క‌రోనా సోకిందని, ఐసోలేష‌న్‌లో వుంటున్నార‌ని, ఆ కార‌ణంగానే శివాజీ గ‌ణేష‌న్ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన‌లేక‌పోయార‌ని వ‌రుస పుకార్లు మొద‌ల‌య్యాయి. అయితే త‌న‌కు ఎలాంటి వైర‌స్ సోక‌లేద‌ని, కాలు బెన‌క‌డం వ‌ల్లే తాను జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రిలో చేరిన విజయ్‌కాంత్ కు ట్రీట్‌మెంట్ అనంత‌రం నెగెటివ్ అని తేలింది. ఆయ‌న‌ని కొన్ని రోజులు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వుంచి డిశ్చార్జ్ చేస్తార‌ట‌.