మోడీ పై మళ్ళీ చెలరేగిన ప్రకాష్ రాజ్


actor prakash raj fire on pm modi

ప్రధాని నరేంద్ర మోడీ పై మళ్ళీ చెలరేగిపోయి తీవ్ర విమర్శలు చేసాడు నటుడు ప్రకాష్ రాజ్ . కర్ణాటకలో ఎన్నికలు ఉన్నందున ప్రధాని మోడీ తాను కన్నడ వాడినని చెప్పుకోవడమే ప్రకాష్ రాజ్ కోపానికి కారణం . అసలు ఇప్పటికే పలుమార్లు భారతీయ జనతా పార్టీ మీద , నరేంద్ర మోడీ మీద ఆగ్రహంగా ఉన్నాడు ప్రకాష్ రాజ్ . పలుమార్లు మోడీ ని విమర్శిస్తూ ట్వీట్ చేయడమే కాకుండా కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో కూడా ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు .

ఇక మోడీ పై విమర్శల విషయానికి వస్తే …… కన్నడ నాట అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి నేను కూడా కన్నడ వాడినే అని మోడీ పేర్కొనగా ప్రకాష్ రాజ్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు . ”మీరు కన్నడిగ గుజరాతీ లో గురజా రాతి , మీరు అబద్దాల కోరు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలి …. మతి చలించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కన్నడ వాడిని అని అంటున్నారు లేకపోతే ఏదో ఒక దేశానికి వెళ్లి హాయిగా టీ తాగుతూ ఉండేవాడివి ” అంటూ మోడీ పై విరుచుకు పడ్డాడు ప్రకాష్ రాజ్ . అంతేకాదు ఈ దేశంలో అన్ని పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయని కానీ ఏ సిద్ధాంతం లేని పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ప్రకాష్ రాజ్ .