టాలీవుడ్ విల‌న్‌ క‌రోనా భ‌యంతో క్వారెంటైన్‌కు!

టాలీవుడ్ విల‌న్‌ క‌రోనా భ‌యంతో క్వారెంటైన్‌కు!
టాలీవుడ్ విల‌న్‌ క‌రోనా భ‌యంతో క్వారెంటైన్‌కు!

భోజ్‌పురీ నుంచి వ‌చ్చి టాలీవుడ్‌లో విల‌న్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు ర‌వికిష‌న్‌. అల్లు అర్జున్ న‌టించిన `రేసు గుర్రం` చిత్రంలో మ‌ద్దాలి శివారెడ్డిగా త‌న‌దైన విల‌నీని ప‌డించి తెలుగులో మంచి మార్కెట్‌ని సృష్టించుకున్నారు. `సుప్రీమ్‌`లోనూ విల‌న్‌గా ఆక‌ట్టుకున్న ర‌వికిష‌న్ తాజాగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. కార‌ణం క‌రోనా.

ర‌వికిష‌న్ పీఏకు తాజాగా క‌రోనా వైర‌స్ సోకింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నటుడు ర‌వికిష‌న్ స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. `నా ద‌గ్గ‌ర పీఏగా ప‌ని చేస్తున్న 42 ఏళ్ల గుడ్డూ పాండే గ‌త కొన్ని రోజుల‌గా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. వైద్య ప‌రీక్ష‌లు చేయించ‌గా టెస్టుల్లో అత‌నికి క‌రోనా సోకిన‌ట్టు నిర్థార‌ణ అయ్యింది. దీంతో అత‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నాం. అత‌ను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను` అన్నారు ర‌వికిష‌న్‌.

త‌న పీఏకు పాజిటివ్ అని తెలియ‌డంతో ర‌వికిష‌న్ కూడా స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌కు చెందిన ర‌వికిష‌న్ భోజ్‌పురి ఇండ‌స్ట్రీలో సూప‌ర్‌స్టార్‌. బీజేపీ పార్టీకి గోర‌ఖ్‌పూర్ ఎంపీగా ప‌నిచేస్తున్నారు. ర‌వికిష‌న్ ఒక‌ప్ప‌టి క్రేజీ హీరోయిన్ న‌గ్మాతో డేటింగ్ చేసి వార్త‌ల్లో కూడా నిలిచిన విష‌యం తెలిసిందే.