ర‌జ‌నీకి క‌రోనా.. ఫ్యాన్స్ ఫుట్‌బాల్‌ ఆడేశారు!ర‌జ‌నీకి క‌రోనా.. ఫ్యాన్స్ ఫుట్‌బాల్‌ ఆడేశారు!
ర‌జ‌నీకి క‌రోనా.. ఫ్యాన్స్ ఫుట్‌బాల్‌ ఆడేశారు!

సోష‌ల్ మీడియాలో వికృత చేష్ట‌లు వెర్రివేశాలు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. ఇటీవ‌ల హీరోయిన్‌ల‌ని బూతులు తిడుతూ ఆట‌ప‌ట్టించే ఫ్యాన్స్ రోజు రోజుకీ ఎక్కువైపోతుంటే నాన్నా పులి అనే  సామెత త‌ర‌హాలో లేనిది ఉన్న‌ట్టు.. ఉన్న‌ది లేన‌ట్టు క్రియేట్ చేస్తూ స్టార్ హీరోల మీదే కొంద మంది సైకోలు జోకులు వేస్తున్నారు. బాలీవుడ్‌లో క‌మాల్ ఆర్ ఖాన్ హీరోలు, హీరోయిన్‌ల‌ని ట్రోల్ చేస్తూ చాలా సంద‌ర్భాల్లో అడ్డంగా బుక్కైన విష‌యం తెలిసిందే.

తాజాగా ఇత‌ని త‌ర‌హాలోనే మ‌రో బాలీవుడ్ బుల్లితెర న‌టుడు రోహిత్ రాయ్ ఏకంగా త‌మిళ సూప‌ర్‌స్టార్ మీదే ట్వీట్ చేసి ఫ్యాన్స్ చేతిలో బుక్క‌య్యాడు. `ర‌జ‌నీకాంత్‌కు క‌రోనా పాజిటివ్ దీంతో క‌రోనా వైర‌స్ క్వారెంటైన్‌లోకి వెళ్లింది` అంటూ స‌ర‌దాగా ట్వీట్ చేశాడు. ఎంత పెద్ద వారైనా క‌రోనాకు ఆతీతులు కాద‌ని, ఇది చూసిన ఆగ్ర‌హించిన ర‌జ‌నీ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా రోహిత్ రాయ్‌ని ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు.

విష‌యం సీరియ‌స్ కావ‌డంతో త‌ను ర‌జ‌నీ సార్‌పై జోక్ చేశాన‌ని, దీనికే ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తే ఎలా? . తాను చేసిన వ్యాఖ్య‌ల్లో నిగూఢ అర్థాన్ని గ‌మ‌నించాల‌ని స‌మాధానం చెప్పాడు. అయినా స‌రే ర‌జ‌నీ ఫ్యాన్స్ రోహిత్ రాయ్‌ని ట్రోల్ చేయ‌డం మాత్రం ఆప‌డం లేదు. ప్ర‌స్తుతం ఈ అంశం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.