సత్యదేవ్ & లక్ష్మీ మంచు టిక్ టాక్ వీడియో


సత్యదేవ్ & లక్ష్మీ మంచు టిక్ టాక్ వీడియో
సత్యదేవ్ & లక్ష్మీ మంచు టిక్ టాక్ వీడియో

నటుడు సత్యదేవ్ అంటే మనకు గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ సర్ డైరెక్షన్ లో వచ్చిన “జ్యోతిలక్ష్మి” సినిమా. కానీ అంతకుముందే సత్యదేవ్ గారు “మిస్టర్ పర్ఫెక్ట్” సినిమాలో ప్రభాస్ తో; “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో మహేష్ బాబు తో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేశారు. ఇప్పుడు సోలో హీరోగా మంచి మంచి సబ్జెక్ట్ లు సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తున్నారు. మరోవైపు సహాయ నటుడిగా కూడా పెద్ద సినిమాలలో నటిస్తున్నారు. “కేరాఫ్ కంచర్లపాలెం” సినిమాతో మనకు ఒక లైఫ్ సైకిల్ టైప్ సినిమా ను అందించిన దర్శకుడు వెంకటేష్ మహా ప్రస్తుతం సత్యదేవ్ తో “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో సత్యదేవ్ ఒక గ్రామీణ ఫోటోగ్రాఫర్ గా కనిపిస్తున్నారు మలయాళ సినిమా “మహేశాంతే ప్రతీకారం” కు ఇది రీమేక్. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ సినిమా లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో “నింగి చుట్టే” అనే మరొక పాట రిలీజ్ అయింది. “కేరాఫ్ కంచర్లపాలెం” సినిమాలో “ఆశ పాశం బందీ చేసేలే..” అనే అద్భుతమైన పాటను రాసిన “విశ్వ” గారు ఈ పాటను రాశారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన టిక్ టాక్ వీడియోను నటి మంచు లక్ష్మి షేర్ చేశారు. సత్యదేవ్ మరియు లక్ష్మీ మంచు మధ్య మంచి స్నేహం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో యువ నటీ నటులు అందరూ ఎవరు సినిమా చేసినా, ఒకరికి సినిమాని మరొకరు ప్రమోట్ చేసుకుంటూ ఒక ఆరోగ్యకరమైన కల్చర్ ని తీసుకొస్తున్నారు. నిజంగా ఇదొక మంచి పరిణామం.

“బాహుబలి” లాంటి ఒక భారీ సినిమా తీసిన తర్వాత ఇలాంటి ఒక చిన్న సబ్జెక్టు ద్వారా పెద్ద ఎమోషన్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు… ఆర్కా మీడియా వారు. ఈ టిక్ టాక్ వీడియోలో.. హీరో హీరోయిన్ ని చూడటం; హీరోయిన్ ఫోటో దిగటానికి హీరో స్టూడియో కి వచ్చినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సరదా సంభాషణ లాంటి షాట్స్ ఇందులో ఉన్నాయి. మంచు లక్ష్మి గారు నిజంగా ఒక గ్రామీణ యువతి లాగా తయారై ఈ వీడియోను చేయటం మరొక హైలెట్. ఇక నటన పరంగా.. లక్ష్మి గారి గురించి కొత్తగా చెప్పేదేముంది. భారీ సినిమాల మధ్యలో ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా కోసం సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

@lakshmimanchuAwesome song from UMUR @arkamediaworks ##umamaheshwaraugraroopasya ##umuronapr17th ##umur ##telugu ##telugumovie

♬ original sound – ArkaMediaWorks

Credit: TikTok