వెంక‌ట్ మ‌ళ్లీ వ‌చ్చేస్తున్నాడు!వెంక‌ట్ మ‌ళ్లీ వ‌చ్చే స్తున్నాడు!
వెంక‌ట్ మ‌ళ్లీ వ‌చ్చే స్తున్నాడు!

`సీతారాముల క‌ల్యాణ్యం చూత‌ము రారండి`.. గ్రేట్ ఇండియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్‌పై వైవీఎస్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో హీరో అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్ర‌మిది. ఈ సినిమా ద్వారా వెంక‌ట్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి విజ‌యాన్ని సాధించి వెంక‌ట్‌కు హీరోగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఆ త‌రువాత వెంకట్ “అన్న‌య్య‌`, భ‌లేవాడివి బాసూ`, ఆనందం, శివ‌రామ‌రాజు, స‌లీమ్ వంటి చాలా చిత్రాల్లో న‌టించాడు. క్ర‌మంగా క్రేజ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో టాలీవుడ్‌కు గ‌త ఏడేళ్లుగా దూరంగా వుంటున్నాడు. తాజాగా మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సారి సినిమా ద్వారా కాకుండా వెబ్ సిరీస్ ద్వారా కావ‌డం విశేషం.

ఆహా ఓటీటీ కోసం న‌వ‌దీప్, పూజిత పొన్నాడ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న వెబ్ సిరీస్ `ర‌న్‌`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో రూపొందిన ఈ సిరీస్ ద్వారా వెంక‌ట్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల 29 నుంచి ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ సిరీస్ ఆహాలో అందుబాటులోకి రాబోతోంది. దీన్ని క్రిష్ ఫ్రెండ్ వై. రాజీవ్‌రెడ్డి నిర్మించారు.