స్టార్ హీరో మేనల్లుడు హీరోగా పరిచయం అవుతున్నాడు!


Actor's Vikram's nephew Arjuman Introducing in films
Actor’s Vikram’s nephew Arjuman Introducing in films

వెర్సటైల్ యాక్టర్ విక్రమ్ సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే..! ఇక విక్రమ్ వారసత్వంగా ఆయన తనయుడు ధ్రువ్‌ కూడా ‘ఆదిత్య వర్మ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తెలుగులో అర్జున్ రెడ్డి కి ఇది సీక్వెల్. విషయం ఏమిటంటే విక్రమ్ ఇంటినుండి మరో హీరో పరిచయం కానున్నాడు.. అతను ఇంకెవరో కాదు విక్రం సోదరి అనిత కుమారుడు అర్జుమన్‌. ఇతను విక్రంకి స్వయానా మేనల్లుడు. విజయ్‌ శ్రీజి ఈ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘దాదా 87’ చిత్రం ద్వారా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విజయ్ శ్రీజి. ఈ చిత్రానికి ‘పొల్లాద ఉలగిన్‌ భయంగర గేమ్‌’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇందులో బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఐశ్వర్య అర్జుమన్ కి జోడీగా నటిస్తుంది. జీడీఆర్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

‘‘విక్రం మేనల్లుడు అర్జుమన్‌కు సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంది. నటన, నృత్యం, పోరాటాలలో ఆయన శిక్షణ పొందారు. నేను ఇటీవల రాసుకున్న కథకు ఆయన కరెక్టుగా ఉంటారని అనిపించింది. ఆయన్ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉందని’’ అని దర్శకుడు విజయ్ శ్రీజి తెలిపారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ను సెప్టెంబరులో జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్నారు..!