ఆమనితో అసభ్యంగా ప్రవర్తించారట


actress aamani shocking comments on casting couchమాజీ హీరోయిన్ ఆమని ని కూడా అప్పట్లో చాలామంది సినిమావాళ్లు ట్రై చేశారట ! అయితే నేరుగా ఆ…… సుఖం అందించాలని అడగలేదట కానీ గెస్ట్ హౌజ్ కి రండి వస్తే అక్కడ సరదాగా మాట్లాడుకోవచ్చు ,గెటప్ గురించి చర్చించుకోవచ్చు అని పదేపదే ఫోన్ లు చేసేవారట ! ఈ విషయాన్నీ తాజాగా ఆమని వెల్లడించింది అయితే ఫోన్ చేసి మాట్లాడుతున్న వాళ్ళ గొంతు లో తేడా అనిపించేది అందుకే నేను అటువంటి వాళ్ళని దూరం పెట్టాను అని అంటోంది ఆమని .

90 వ దశకంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఆమని . ఈ భామ నటిస్తున్న సమయంలో పలువురు హీరోయిన్ లు అందాలను ఆరబోస్తూ ఇమేజ్ తెచ్చుకోగా ఆమని మాత్రం అటు గ్లామర్ పాత్రలతో పాటుగా ఇటు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను పోషించి తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది . అయితే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యింది , ఆ తర్వాత వైవాహిక జీవితం గందరగోళంలో పడటంతో కొన్నాళ్ళు ఇబ్బంది పడింది .

కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ ముఖానికి రంగేసుకోవడానికి సిద్దమయ్యింది . తాజాగా ఐపీసీ సెక్షన్ భార్యబంధు చిత్రంలో నటించింది ఆమని . ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ అప్పట్లో అది లేదని కాకపోతే కొంతమంది హీరోయిన్ లు అనగానే చులకన గా చూసేవాళ్లని , ఫోన్ లో అసభ్యంగా మాట్లాడేవాళ్ళని అంటోంది .