వరదల్లో చిక్కుకున్న హీరోయిన్


actress ananya and her family struck in kerala familyకేరళలో వరదలు భీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . గతకొద్ది రోజులుగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు . వరదలతో కేరళ ప్రజలు అల్లాడుతుండగా ఆ వరదల్లో పలువురు సినీ ప్రముఖులు కూడా చిక్కుకొని ఇబ్బందిపడుతున్నారు . హీరోయిన్ అనన్య కుటుంబం కూడా వరదల్లో చిక్కుకొని ప్రాణాలను అరచేతిలో పట్టుకొని మొత్తానికి వరద ప్రాంతాల నుండి బయటపడింది . ప్రస్తుతం తన స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంది అనన్య తన కుటుంబంతో సహా .

అనన్య మాత్రమే కాకుండా మోహన్ లాల్ , జయరాం , సలీం కుమార్ తదితర నటుల ఇండ్లు కూడా వరదలో చిక్కుకున్నాయి దాంతో వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు . అయితే అనన్య ఉంటున్న కొచ్చి లోని ఇల్లు పూర్తిగా నీటి లో మునగడం వల్ల కుటుంబ సభ్యులంతా హాహాకారాలు చేశారట ! అయితే లక్కీ గా ఇతరుల సహాయంతో అనన్య ఆ ఇంటి నుండి సురక్షిత ప్రాంతానికి వెళ్ళింది . వరద నీటిలో ఉన్నప్పుడు భయమేసిందని , కేరళలో ప్రజలు కష్టాలు పడుతున్నారని వాళ్ళని ఆదుకోండని సోషల్ మీడియా సాక్షిగా కోరుతోంది అనన్య . తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది అనన్య .

English Title: actress ananya and her family struck in kerala family