సెక్స్ రాకెట్ పై స్పందించిన అనసూయ


actress anasuya responds on sex rocketఅమెరికాలో సెక్స్ రాకెట్ ని పోలీసులు చేధించిన విషయం తెలిసిందే . కాగా ఆ సెక్స్ రాకెట్ పై హాట్ భామ అనసూయ స్పందించింది . ఎందుకంటే సెక్స్ రాకెట్ ని నిర్వహించిన కిషన్ మోదుగుముడి అనసూయ కు కూడా ఫోన్ చేసి అమెరికాలో నిర్వహించే ఈవెంట్ లకు హాజరు కావాల్సిందిగా కోరాడట ! అయితే కిషన్ మాటల్లో ఏదో తేడా అనిపించడం , ప్రాపర్ వేలో మాటలు లేకపోవడంతో రానని చెప్పిందట !

రానని చెప్పినప్పటికీ అతడు నిర్వహించిన పలు ఈవెంట్ లలో అనసూయ పాల్గొనబోతున్నట్లు ప్రచారం చేసాడట కిషన్ . అయితే కిషన్ నిర్వహించిన ఈవెంట్ లకు వెళ్ళలేదు కానీ ఒకసారి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి షోలో పాల్గొన్నానని , ఆ తర్వాత మరోసారి మాత్రమే ఈవెంట్ కు వెళ్లానని అంతేకాని కిషన్ అలియాస్ శ్రీ రాజ్ నిర్వహించిన షోలకు మాత్రం వెళళ్లేదని స్పష్టం చేసింది . అంటే ఆ రాకెట్ తో తనకు ఏ సంబంధం లేదని అంటోంది హాట్ భామ అనసూయ . రంగమ్మత్త గా రంగస్థలం చిత్రంలో నటించి అందరి చేత ప్రశంసలు అందుకున్న ఈ భామ పాత్ర నచ్చితే అది ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అని అంటోంది .