పారిపోయిన హీరోయిన్


actress anupama prakash left from shooting spotషూటింగ్ జరుగుతున్న లొకేషన్ నుండి అర్దాంతరంగా దర్శక నిర్మాతలకు కానీ హీరోకు కానీ ఎవ్వరికీ చెప్పకుండా ఓ హీరోయిన్ పారిపోయింది దాంతో చిత్ర నిర్మాత తల పట్టుకోవడమే కాకుండా కొద్దిసేపు ఆమె ఏమయ్యిందో ? ఎక్కడికి వెళ్లిందో ? క్షేమంగా ఉందో లేదో తెలియక షాకయ్యాడట . సంచలనం సృష్టించిన ఈ సంఘటన కొడైకెనాల్ లో జరిగింది . ఇంతకీ షూటింగ్ నుండి పారిపోయిన హీరోయిన్ ఎవరో తెలుసా …….. అనుపమా ప్రకాష్ . అవళుక్కెన్న అళగియ ముగం పేరుతో తెరకెక్కుతున్న తమిళ చిత్రంలో నటిస్తోంది అనుపమా ప్రకాష్ .

అయితే షూటింగ్ నిమిత్తం కొడైకెనాల్ లోని ఎత్తైన కొండల్లో షూటింగ్ జరుపుకుంటోంది . అయితే కొడైకెనాల్ లోని ఎత్తైన ప్రదేశాలను , అడవులను , లోయలను చూసేసరికి పాపం ఈ భామకు భయం పట్టుకుందట. తీవ్ర భయాందోళనకు లోనైనా ఈ భామ ఎవరికీ చెప్పాపెట్టకుండా షూటింగ్ లొకేషన్ నుండి పారిపోయిందట . మెల్లిగా ఎలాగోలా మధురై చేరిన అనుపమా ప్రకాష్ అక్కడి నుండి ఢిల్లీ వెళ్లిపోయిందట అయితే లొకేషన్ లో ఉండాల్సిన హీరోయిన్ లేకపోవడంతో , ఆమె జాడ తెలియకపోవడంతో ఖంగుతిన్న చిత్ర బృందం రోజంతా వెతుకుతూ షూటింగ్ పేకప్ చెప్పేసి భయంతో వణికిపోయారట . కట్ చేస్తే ఢిల్లీ లో ఉన్నానని కబురు అందించడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారట . అయినా భయం అనిపిస్తే దర్శక నిర్మాతలలో ఎవరికైనా చెప్పాలి కానీ అలా పారిపోతే ఎలా అనుపమా .

English Title: actress anupama prakash left from shooting spot