నటి చైత్ర ని తీవ్రంగా కొట్టిన భర్త


actress chaitra complaint on her husbandకన్నడ నటి చైత్ర ని ఆమె కట్టుకున్న భర్త తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలైన సదరు నటి చికిత్స తీసుకొని పుట్టింట్లో ఉంటోంది , తనపై అకారణంగా దాడి చేసిన భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది చైత్ర. సంఘటన వివరాలలోకి వెళితే ….. చైత్ర 2006 లో లిక్కర్ వ్యాపారి అయిన పోతురాజు తో వివాహం అయ్యింది , పైగా వారి ప్రేమకు సాక్షిగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు . అయితే అదంతా గతం . పెళ్లి జరిగి 12 ఏళ్ళు కావడంతో భర్త పోతరాజు కు చైత్ర పై అనుమానం పెరిగింది దాంతో ఆమె బయటకు వెళితే బాడీగార్డ్ ని పంపుతున్నాడు అది చైత్ర కు ఇష్టం లేదు .

ఇదే విషయాన్నీ భర్తకు చెప్పి నిలదీయడంతో చైత్ర ని తీవ్రంగా కొట్టడమే కాకుండా గాయాలు అయినప్పటికీ ఆమెని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఇంట్లోంచి . తీవ్ర గాయాల పాలైన చైత్ర పోలీసులను ఆశ్రయించి భర్త పై ఫిర్యాదు చేసింది . తన భర్త మరో యువతి మోజులో ఉన్నాడని అందుకే నన్ను వదిలించు కోవడానికి ఇలా దాడి చేస్తున్నాడని నాకు తగిన న్యాయం చేయాల్సిందిగా పోలీసులను కోరుకుంటోంది .