ఆ వార్తలను ఖండించిన హెబ్బా పటేల్


actress hebah patel denies rumours bigg boss 2 entryనేను బిగ్ బాస్ 2 రియాలిటీ షోలో పాల్గొనడం లేదు , నన్ను ఎవరూ ఆ షో కోసం సంప్రదించలేదు నాకు కూడా అలాంటి ఆలోచన ఏది లేదు అంటూ హెబ్బా పటేల్ పై వస్తున్నవార్తలను ఖండించింది . గతకొద్ది రోజులుగా బిగ్ బాస్ 2 హౌజ్ లోకి హెబ్బా పటేల్ వెళ్తుందని , గ్లామర్ కోసం హెబ్బా ని తీసుకువస్తున్నారని సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి దాంతో నిజంగానే హెబ్బా పటేల్ వస్తొందని అనుకున్నారు . కట్ చేస్తే నేను బిగ్ బాస్ 2 షోలోకి వెళ్లడం లేదు , నన్ను ఎవరూ అడగలేదు కూడా అని చెప్పింది .

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ అందాలను ఆరబోయడంలో అందరికంటే ముందే ఉంటుంది . స్కిన్ షోతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామకు ఇటీవల ఛాన్స్ లు తగ్గుముఖం పట్టాయి . అయినప్పటికీ నేను సినిమాలతో చాలా బిజీ గా ఉన్నానని అంటోంది . ఇక బిగ్ బాస్ 2 విషయానికి వస్తే …….. ఈ షోలో పలువురు అందమైన భామలు ఉన్నప్పటికీ మొదటి బిగ్ బాస్ కి వచ్చినంత క్రేజ్ ఈ రెండో సీజన్ కు మాత్రం రావడం లేదు . నాని తన హోస్ట్ తో ఆకట్టుకుంటున్నాడు కానీ ఎన్టీఆర్ తో పోల్చడం వల్ల కొంత మైనస్ అయ్యింది .