లిప్ లాక్ లు ఇవ్వకతప్పలేదు : ఇర్రా మోర్


Actress IRRA MOR about why the lip lock is necessary

భైరవ గీత చిత్రంలో నటించిన ఇర్రా మోర్ లిప్ లాక్ లపై సంచలన వ్యాఖ్యలు చేసింది . వందలాది యూనిట్ సభ్యుల ముందు లిప్ లాక్ లు ఇవ్వడం చాలా ఇబ్బందికర విషయం కానీ సినిమా కోసం తప్పదు కాబట్టి అన్ని లిప్ లాక్ లు ఇచ్చానని సంచలన వ్యాఖ్యలు చేసింది భైరవ గీత హీరోయిన్ ఇర్రా మోర్ . యాక్షన్ తో పాటుగా ఘాటు రొమాన్స్ పుష్కలంగా ఉన్న సినిమా ఈ భైరవ గీత . ఇప్పటికే ట్రైలర్ తో ఆసక్తి రేపిన ఈ చిత్రాన్ని రెండు నెలలుగా వాయిదాలు వేస్తూనే ఉన్నారు . ఈనెల 23 న విడుదల అన్నారు కట్ చేస్తే మరోసారి వాయిదావేశారు . ఎట్టకేలకు ఈనెల 30 న భైరవ గీత విడుదల అంటూ రాంగోపాల్ వర్మ ప్రకటించాడు .

మా కుటుంబం చాలా స్ట్రిక్ట్ ఎందుకంటే మా నాన్న మాత్రమే కాదు ఎంటైర్ ఫ్యామిలీ కూడా హైలీ క్వాలిఫైడ్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చుకుంది . మా అమ్మ ప్రోఫేసర్ , చెల్లి డాక్టర్ , సోదరుడు ఐటీ జాబ్ చేస్తున్నాడు అంటూ సొంత డబ్బా బాగానే కొట్టుకుంది . మా కుటుంబంలో అన్నీ పద్దతిగా ఉంటాయి కానీ నేను మాత్రం ఇలా లిప్ లాక్ లు ఇవ్వాల్సి వచ్చింది . అసలు నేను ఇలా ఎలా చేయగలిగానో తెలీడం లేదు ……. సినిమా మాయ అంటే ఇదేనేమో ! అంటూ తెలివితేటలు ప్రదర్శిస్తోంది ఇర్రా మోర్ .

English Title:  Actress IRRA MOR about why the lip lock is necessary