చెక్ బౌన్స్ కేసులో నటికి  6 నెలల శిక్ష


Actress Koena Mitra has been sentenced six months prison
Actress Koena Mitra has been sentenced six months prison

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి కోయినా మిత్రా కు 6 నెలల శిక్ష పడింది . దాంతో షాక్ తిన్న కోయినా మిత్రా ఎగువ కోర్టు కి వెళ్తానంటూ మీడియా ముందుకు వచ్చింది . అంతేకాదు నాకు 22 లక్షల అప్పు ఇచ్చానని , అందుకు 3 లక్షలు చెక్ బౌన్స్ అయ్యిందని మోడల్ పూనమ్ సేథి చెప్పడం విడ్డురంగా ఉందని , ఆ స్థాయి పూనమ్ సేథి కి లేదని  అంటోంది కోయినా మిత్రా  .

అయితే మోడల్ పూనం మాత్రం 2013 లో 22 లక్షలు నాకు బాకీ పడిందని అందులో భాగంగా 3 లక్షల చెక్ ఇచ్చిందని అయితే బౌన్స్ కావడంతో కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చిందని అంటోంది . కోర్టు నటి కోయినా మిత్రా ని దోషిగా తేలుస్తూ ఆరు నెలల జైలు శిక్ష విధించింది . దాంతో పై కోర్టుకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది కోయినా మిత్రా .