దివంగ‌త న‌టి మ‌నోర‌మ కుమారుడికి ఏమైంది!


దివంగ‌త న‌టి మ‌నోర‌మ కుమారుడికి ఏమైంది!
దివంగ‌త న‌టి మ‌నోర‌మ కుమారుడికి ఏమైంది!

త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో అమ్మ పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు దివంగ‌త న‌టి మ‌నోర‌మ‌. పేరున్న హీరోల చిత్రాల్లో న‌టించిన ఆమె గ‌త కొంత కాలం క్రితం మ‌ర‌ణించారు. ఆమెకు ఓ కుమారుడు వున్న‌డు పేరు   భూప‌తి. ఆయ‌న తాజాగా ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నానికి పూనుకోవ‌డం కోవీవుడ్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.  భూప‌తి అధిక మోతాదులో నిద్ర మాత్ర‌లు మింగాడ‌ట‌.

దీంతో అప‌స్మార‌క స్థితికి వెళ్లిన అత‌న్ని కుటుంబ స‌భ్యులు హుటా హుటిన ద‌గ్గ‌ర‌లో వున్న ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డంతో ప్రాణాపాయం త‌ప్పిన‌ట్టు తెలిసింది. న‌టిగా మంచి పేరున్న మ‌నోర‌మ కుమారుడు భూప‌తి ఎందుకు ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేశాడు?  దీని వెన‌కున్న అస‌లు విష‌యం ఏంట‌ని ఆరాతీస్తే షాకింగ్ విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చాయి.

దేశంలో క‌రోనా వైర‌స్ విజంభిస్తుండ‌టంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని విధించిన విష‌యం తెలిసిందే. నిత్యావ‌స‌రాలు కొంత అందుబాటులో వున్నా మందు బాబుల‌కు మాత్రం మందు దొర‌క‌డం లేదు. భూప‌తి మందుకు బానిస‌య్యాడ‌ట‌. లాక్ డౌన్ కార‌ణంగా అత‌నికి మందు ల‌భించ‌క‌పోవ‌డంతో ఆత్మ హ‌త్యా ప్ర‌యత్నానికి పూనుకున్నాడ‌ని తెలిసి అంతా అవాక్క‌వుతున్నార‌ట‌. న‌టిగా మంచి పేరు తెచ్చుకున్న మ‌నోర‌మ‌కు త‌న‌యుడు భూప‌తి త‌ల‌వంపులు తెస్తున్నాడ‌ని జ‌నం మండిప‌డుతున్నార‌ట‌.