భారీ యాక్సిడెంట్ నుండి బయటపడిన హీరోయిన్


actress monal gajjar great escape from car accidentభారీ యాక్సిడెంట్ నుండి తృటిలో తప్పించుకుంది హీరోయిన్ మోనాల్ గజ్జర్ . సుడిగాడు , బ్రదర్ ఆఫ్ బొమ్మాలి , ఒక కాలేజ్ స్టోరీ , దేవదాసి చిత్రాల్లో నటించిన ఈ భామ తన స్నేహితుడి పుట్టినరోజు సందర్బంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ కి మిత్రులతో కలిసి వెళ్ళింది అయితే తిరుగు ప్రయాణములో ఉదయ్ పూర్ హైవే పై భారీ యాక్సిడెంట్ జరిగింది . ఆ యాక్సిడెంట్ లో మోనాల్ గజ్జర్ ప్రయాణిస్తున్న కారు దారుణంగా దెబ్బతింది .

అయితే సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది . మెడ పట్టు తప్పడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్న అనంతరం మెడ పట్టితో ఇంటికి చేరుకుంది . అయితే ఈలోపునే హీరోయిన్ మోనాల్ గజ్జర్ చనిపోయిందని పుకార్లు సోషల్ మీడియాలో సృష్టించడంతో వాటికీ షాక్ అయిన ఈ భామ నేను క్షేమంగానే ఉన్నానని చెబుతూ ఓ వీడియో ని పోస్ట్ చేసింది .

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తమిళ , మలయాళ , హిందీ , గుజరాతీ బాషలలో కూడా నటిస్తోంది . అయితే క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ రోహిత్ పుట్టినరోజు కి వెళ్లిన సమయంలో ఈ ఘోర ప్రమాదం జరగడంతో ఇప్పుడు మంచాన పడి ఉంది . డాక్టర్లు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారట మోనాల్ గజ్జర్ కు .

English Title: actress monal gajjar great escape from car accident