గత్యంతరం లేక వ్యాంప్ పాత్రలు చేసిందట


Actress Pavitra lokesh about her careerమా నాన్న చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం కొన్ని వ్యాంప్ పాత్రలు పోషించాల్సి వచ్చిందని అసలు విషయాన్నీ చెప్పింది నటి పవిత్రా లోకేష్ . కన్నడ భామ అయిన పవిత్రా లోకేష్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ అయిపోదామని అనుకుందట ! కానీ ఆమె ఊహించింది వేరు జరిగింది వేరు దాంతో బాగా అప్ సెట్ అయ్యిందట ! కానీ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే కుదరదు కదా అందుకే కొన్ని వ్యాంప్ పాత్రలతో పాటు ఎక్స్ పోజింగ్ పాత్రలు కూడా చేయాల్సి వచ్చిందని బాధపడుతోంది . అప్పటి పరిస్థితి అలా ఉందని వాపోతోంది పవిత్రా లోకేష్ .

కన్నడంలో అంటే వ్యాంప్ పాత్రలు , చిన్న చిన్న పాత్రలు పోషించింది కానీ తెలుగులో అమ్మ , లేక వదిన పాత్రలకు , అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది పవిత్రా లోకేష్ . కన్నడ స్టార్ హీరో అంబరీష్ ప్రోత్సాహంతో నేను సినిమాల్లోకి వచ్చానని అయితే ఎత్తుగా , లావుగా ఉండటం వల్ల అనుకున్న స్థాయిలో హీరోయిన్ పాత్రలు రాలేదని అంటోంది , అయితే ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నానని ఎందుకంటే పలువురు హీరోలకు , హీరోయిన్ లకు తల్లిగా నటిస్తూ పేరు తో పాటు డబ్బులు కూడా దండిగా వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తోంది . ఆమధ్య పవిత్రా లోకేష్ ఎక్స్ పోజింగ్ సీన్స్ ని తెగ సెర్చ్ చేసారు నెటిజన్లు . అప్పట్లో వైరల్ గా మారాయి ఆ సీన్స్ .

English Title: actress pavitra lokesh about her career